ఈ మధ్య సుజాతగారి బ్లాగులో "తెలుగంటే అంత అలుసా" అన్న టపా ఇచ్చిన స్ఫూర్తి ఇది. తెలుగు భాషమీద మమకారం చాలామందిలో ఉందన్న నమ్మకం అక్కడి వ్యాఖ్యలవల్ల కలిగింది. దీనిగురించి మనమేమైనా ఎందుకు చెయ్యకూడదూ అన్న మురళిగారి ఆలోచనకి కార్యరూపం ఇవ్వాలన్న ఉత్సాహం కలిగింది.
నిజానికి తెలుగుభాషేమీ చనిపోలేదు దాన్ని పునరుద్ధరించడానికి. పరిరక్షించుకోవాల్సినంత దీనస్థితిలో ఉందని కూడా అనలేం. కానీ దీనిగురించి మరికాస్త విస్తృత ప్రచారం అవసరం అని మాత్రం అనిపిస్తోంది. ముఖ్యంగా తెలుగునాట తెలుగు మాట్లాడాల్సిన అవసరమూ, అందులోని ఆనందమూ ప్రతి తెలుగువాడికి తెలియాలనుకోవడం అత్యాశ కాదు కదా.
మన భాషమీద మనం అభిమానం చూపించడానికి:
ఇతర భాషలని కించపరచాల్సిన అవసరం లేదు
ద్వేషించాల్సిన అవసరం లేదు
విసర్జించాల్సిన అవసరం కూడా లేదు.
మన భాషని మనవాళ్ళతో మనం చక్కగా, హాయిగా మాట్లాడుకుంటే చాలు.
మన భాషలోని తీయదనాన్ని మనం రుచిచూస్తే చాలు.
మన భాషని మన పిల్లలకి అందిస్తే చాలు.
అంతర్జాలంలో తెలుగు మీద అభిమానం పుష్కలంగా కనిపిస్తోంది. కానీ ఎంత శాతం తెలుగువాళ్ళు అంతర్జాలంలో ఉన్నారు? చాలా తక్కువే కదా. మరి మన అభిమానాన్నీ మన ఆనందాన్నీ మిగతా తెలుగువాళ్ళతో ఎందుకు పంచుకో కూడదూ?
ఈ ఆలోచనకి కార్యరూపం ఇచ్చే ప్రయత్నమే "తెలుగు భాషా ప్రచార సమితి" అన్న గూగులు గుంపు.
తెలుగునాట తెలుగు ప్రచారాన్ని గురించి మరింత చర్చించి, ఒక కార్యాచరణ విధానాన్ని ఏర్పాటు చేసుకొని దాన్ని అమలుపరచాలన్నది ఈ గుంపు ఆకాంక్ష.
మరి ఆ కాంక్ష మీకూ ఉంటే ఆలస్యం చెయ్యకుండా చేయికలపండి.
వట్టి మాటలు కట్టి పెట్టోయ్! గట్టి మేల్ తలపెట్టవోయ్!
Thursday, September 18, 2008
వట్టి మాటలు కట్టి పెట్టోయ్! గట్టి మేల్ తలపెట్టవోయ్!
Subscribe to:
Post Comments (Atom)
14 comments:
నేను కూలా మీలా తెలుగు భాషాభిమానినే !!!!!
కాకపొతే నాకు "ల" పలకదు
ఏమీ అనుకోకండేం అన్నట్టు చెప్పలం మల్చిపోయా :)
అప్పుడప్పుడు "డ" కూలా పలకదు
నాకు తెలుగంటే బోల్లంతా ఇష్టం
అందుకే తెలుగు మీద ప్రయోగాలు చేసేదాన్ని
తెలుగు అక్షలాలు తిలగేచి లాచే దాన్ని
మా అమ్మ మా పిన్ని మా పెద్దమ్మ అందలూ గులుతె లో మాట్లాడుకుంతాలు
నేను అది కూలా నేల్చేసుకున్నా
నేల్చుకోవడమే కాదు
పాటలు కూలా పాలేత్తున్నా
ఇప్పుడు నాకోటి చెప్పాలనుంది
"ఏ దేశమేగినా,ఎందుకాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము"
కామేశ్వర రావు గారు,
మీ ప్రయత్నం అభినందనీయమూ, అనుసరణీయమూ! చూద్దాం, ఎంత మంది స్పందిస్తారో!
సంతోషం కామేశ్వర్రావుగారూ.
అందులో జరిగిన చర్చల సారాంశాలు, రూపుదిద్దుకున్న కార్యాచరణ ప్రణాళికలూ ఇక్కడ పంచుకోవడం మరిచి పోకండి.
చాలా మంచి ప్రయత్నం కామేశ్వరరావు గారు. ఇంత మంచి ఆలోచనకి స్ఫూర్తి నిచ్చిన సుజాత గారు అభినందనీయులు.. మీతో పాటే మేమూ!
చాలా చాలా మంచి ప్రయత్నం. నేను ఈ రోజే చేరుతున్నాను. అభినందనలు.
చాలా మంచి ప్రయత్నం, నేనూ ఒక చెయ్యి వేస్తాను.
లచ్చిమి గారు, మీరు మొత్తానికి "ర" వాడటం చూసాను.
మంచి ప్రయత్నం. మీకు, మీకు స్ఫూర్తినిచ్చిన సుజాత గారికి అభినందనలు.
నిజమే మీరన్నట్లు తెలుగు భాషని ఉద్దరించటానికి మనమేమి ప్రత్యేకంగా చేయనక్కర్లేదు. మనం మన భాషలో మాTlaaడుకుని మన పిల్లలకి మన భాష నేర్పితే చాలు.
"చేయీ చేయీ కలుపుదాం తెలుగులోనే మాట్లాడుకుందాం"
హాయ్ లచ్చిమి, ఎట్లాగైతేనేం నీ నోటి వెంట ర పలికిందన్నమాట. అదే మరి తెలుగు మహత్యం. ఇక నాకు ర పలకదు అనకమ్మా!!
ఆ తిరగేసే గులుతె మా మీద ప్రయోగించొద్దమ్మా!!
నా ఉత్సాహానికి ఇప్పటిదాకా ఊపిరిపోసిన అందరికీ నెనరులు.
మొట్టమొదటి వ్యాఖ్యతోనే స్ఫూల్తినిచ్చిన లచ్చిమి(గాలి)కి ప్లత్యేక నెనలులు :-)
కొత్తపాళీగారు, మీరేదో ప్రవాసంలో ఉన్నారని అనుమానిస్తున్నట్టున్నారు. మీలాటివారు దూరానున్నా ఆయుధం పట్టని కృష్ణుడిలా సారధ్యం వహించవచ్చు! మీరన్నట్టు ఆ గుంపులో విశేషాలని ఇక్కడ తప్పకుండా పెడుతూ ఉంటాను.
సరే మరి, అందరం గుంపులో మాట్లాడుకుందాం.
చాలా మంచి ప్రయత్నం కామేశ్వరరావు గారు.
మీ ప్రయత్నానికి అభినందనలు.
నా సహాయం ఎప్పటికీ ఉంటుంది. నా ఈపోష్టు
ramarajubhaskar at gmail dot com
కామేశ్వరరావు గారూ
తెలుగు వీర లేవరా అన్న మీ మేలుకొలుపు గీతం లో మేమిద్దరమూ కూడా(వేదుల బాలకృష్ణమూర్తి, మల్లిన నరసింహా రావు)మా గొంతులను కలుపుతున్నాము.మా ఉమ్మడి email:I.D.:narasimharaomallina@gmail.com.
మీ ఈ ప్రయత్నం కడు అభినందనీయం.
ninu oka pravasa andhrudanu...ikkada miku oka vishayama chepalani vachanu ii roju meeru chesthuna ii krushi sarvada abhbinandaniyam. telugu loni tiyadanam marey bashalonu ledani na abhipryam elanana... alanadu mana thyagaya garu dakshina bahrathamanthata thana sangeeth madhurimalanu panchi pettaru aa basha loni madhuryani grahinchina kondaru tamilulu, kandigalu mariyu malyalulu andaru aa sangeetha sadanaku telugu nerchukuni aa geethalpana chesaru........ atuvanti prsasthamina cherithra kaligina mana tenugunu iinadu manam kapadukovalisina parsthithi vachinandulaku karanam evaru?
ninu ii nadu thrikarana sudiga telupunadi emanaga ii papam lo ninu okdaini... desa bashalandu telugu lesa anna vakyamunaku ardamu teliyana neti yuvatha choosi manamandaram sigupadali... ituvanti paristhithi karanam prabhuthvama leka vyapradhorani kaligina vidhya samasthala anadi pakaku pedithey...... diniki karanam prathi telugu vididi... mariyu mana andhra samajamu anipisthundi.
ii nati telugu yuvathanu choosi sigupaduthunanu endukanaga variki telugu lipini chaduvuta teliyadu... dinisatham ranuna rojulalo nurusatham kanunuadi...... kani viru tama meda sakthi lo mathram andarikana mundu unnaru ee rojuna manam prapancha nalumulaal ekkada choosina telugu varey kanipisthunaru ...koni sandarbalalo migilina bharatha sodarulu telugu varini choosi asuya paduthunaru... dinini ninu prathyakshamuga anubhavinchanu..... kani mithrulara evidamuganithey telugu yuvatha thama sakthini prapanchamunaku choopisthunado adey vidamuga variki vari basha patlaunna gowravam choopinchalani akankshisthu...
oo telugu vadu
Post a Comment